చెన్నై దాహార్తిని తీర్చే ప్రయత్నంలో భాగంగా కండలేరు రిజర్వాయర్‌కు అంకురార్పణ జరిగింది. 11 కి.మీ. పొడవు కలిగిన మట్టి కట్టతో ఈ రిజర్వాయర్‌ను నిర్మించారు. సౌర గడియారం, బొటానికల్ గార్డెన్స్, జింకల పార్కు, జల విద్యుత్ కేంద్రం, సత్యసాయి గంగ కాలువలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణలు. ఈ రిజర్వాయర్ వద్ద సూర్యాస్తమయ దృశ్యం పర్యాటకులకు కనువిందు చేస్తుంది. బోట్ షికారు, సౌకర్యం ఉంది.
నెల్లూరు నుంచి 44 కి.మీ. దూరంలో కండలేరు ఉంది. బస్సులు, ప్రైవేటు వాహనాల్లో చేరుకోవచ్చు